మిర్చి రైతులను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు (వీడియో)

61చూసినవారు
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది మిర్చి ధరలు అనూహ్యంగా పడిపోయాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్‌ తగ్గడం వల్ల మిర్చి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాలి, వారికి మేలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో ఆలోచిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్