ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ 41 (36) పరుగులకు ఔట్ అయ్యాడు. తొమ్మిదో ఓవర్లో తస్కిన్ అహ్మద్ వేసిన నాలుగో బంతిని బౌండరీగా మలిచే క్రమంలో రోహిత్ క్యాచ్ ఇచ్చి పెవిలియర్ చేరాడు. 10 ఓవర్లు పూర్తయేసరికి టీమిండియా స్కోర్ 69/1 గా ఉంది. కొద్దిలో రోహిత్ హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడు.