ప్రశ్నాపత్రంలా పెళ్లి పత్రిక.. వైరల్ ఫోటో

50చూసినవారు
ప్రశ్నాపత్రంలా పెళ్లి పత్రిక.. వైరల్ ఫోటో
తన పెళ్లి పత్రిక వినూత్నంగా ఉండాలని ఓ టీచర్ ఆలోచించారు. వృత్తికి తగ్గట్లుగా ప్రశ్నాపత్రం రూపంలో పెళ్లి శుభలేఖను ప్రింట్ చేయించారు. శుభలేఖను సింగిల్ ఆన్సర్, మల్టిపుల్ ఛాయిస్ అంటూ 8 ప్రశ్నలుగా విభజించారు. అందులో వరుడు, వధువు, కన్యాదానం చేసే వారి పేర్లు, పెళ్లి తేదీ, కళ్యాణ మండపం, పెళ్లి సమయం, విందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన టీచర్ ప్రత్యూష తన పెళ్లి పత్రికను ఇలా ప్రింట్ చేయించారు. ఈ నెల 23న పెళ్లి జరగనుంది.

సంబంధిత పోస్ట్