ఏపీని వర్క్ ఫ్రం హోమ్ హబ్‌గా చేయాలనేదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏఐ, చాట్ జీపీటీ నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. ప్రవాసాంధ్రులను ఎలా ప్రోత్సహించాలనే దిశగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఆ రోజుల్లోనే తాను ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని, తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయానికి హైదరాబాద్ సంపదే కారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ భూములకు మంచి ధర వస్తుందని అప్పట్లోనే అంచనా వేశాననన్నారు.