AP: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం కాదని మంత్రి నారా లోకేష్ అన్నారు. 'పాదయాత్ర సమయంలో రెడ్ బుక్ గురించి మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు. దాని విషయంలో అనుమానాలు వద్దు. గత ప్రభుత్వంలో చట్టాలను ఉల్లంఘించి ఎవరెవరు ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వారిని వదిలిపెట్టం. ఇప్పటికే యాక్షన్ మొదలైంది. తప్పకుండా పూర్తి చేస్తాం' అని జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ మీట్‌లో వ్యాఖ్యానించారు.