రాజ్యాంగాన్ని తూట్లు పొడిస్తుంది బిజెపినేనని, రాజ్యాంగాన్ని కాపాడేది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అంకెం సీతారామ్ అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే సహించేదిలేదని శనివారం హెచ్చరించారు.