ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ పనులు వెంటనే పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. కాళ్ళ మండలంలో శుక్రవారం కోపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించి ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ప్రక్రియపై సమీక్షించారు.