నగిరి: జయరాం రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు: మాజీ మంత్రి
చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం, నిండ్ర గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు జయరాం రెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఈయన వైసీపీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్య దర్శి మేరీ భర్త జయరాం. ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి ఆర్. కె. రోజా నిండ్రలోని జయరాం రెడ్డి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని రోజా తెలిపారు. పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.