మినీ వ్యాన్ బోల్తా... 8మందికి గాయాలు

76చూసినవారు
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పానాటూరు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ వాసులు మినీ వ్యానులో కాణిపాకం, అరగొండ దర్శనానికి వచ్చారు. తర్వాత వేలూరు గోల్డెన్ టెంపులు బయల్దేరారు. మార్గమధ్యలో పానాటూరు సమీపంలోని అనుపు గ్రామంలో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. 8మంది గాయపడగా వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు గుంతలమయంగా ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్