అప్పలాయగుంటలో తిరుమల లడ్డూల విక్రయం

77చూసినవారు
ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల లడ్డూలు విక్రయిస్తున్నామని జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం ఆలయంలో లడ్డూల విక్రయాన్ని ఆయన ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒకొక్కరికి ఐదు లడ్డూల చొప్పున విక్రయిస్తామన్నారు. ప్రస్తుతం రోజుకు 500 లడ్డూలు అందుబాటులో ఉంచుతున్నామని, శనివారం, ప్రత్యేక రోజుల్లో అదనంగా విక్రయించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్