ఇటీవల కురిసిన అధిక వర్షాలతో ముంపు గురైన ప్రాంతాలను పంచాయతీ పాలకవర్గ సభ్యులు మంగళవారం పరిశీలించారు. మొగల్తూరు పంచాయతీ పరిధి పల్లవ పాలెం హైస్కూలు ఆవరణలో నిలిచిన వర్షపు నీటిని యంత్రాల సహాయంతో బయటకు వెళ్లేలా కచ్చ డ్రైనులను ఏర్పాటు చేశారు. సర్పంచ్ పడవల, మేరీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ బోణం, నరసింహారావు, పాలకవర్గ సభ్యులు,సిబ్బంది పర్యవేక్షించారు.