నరసాపురం మున్సిపాలిటీలోని 10వ సచివాలయం వద్ద శనివారం "ఇది మంచి ప్రభుత్వం"అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు నరసాపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి తెలిపారు. అలాగే నరసాపురం నియోజకవర్గం త్రాగునీరు సమస్య లేకుండా చేస్తాను అని తెలిపారు.