78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం నరసాపురం శ్రీసూర్య హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వేసిన స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో దేశం పట్ల స్వాతంత్రం పట్ల స్ఫూర్తి నింపే విధంగా వేడుకలు నిర్వహించమని శ్రీ సూర్య విద్యాసంస్థల కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ చెప్పారు. ఈ కార్యక్రమంలో
డైరెక్టర్ జి హేమవల్లి, తదితరులు ఉన్నారు.