తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో స్కూల్ బస్సులకు సంబంధించి భద్రతా ప్రమాణాలను సోమవారం తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి. సురేంద్ర నాయక్ పరిశీలించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మొత్తం 329 స్కూలు బస్సులకు గాను ఇప్పటివరకు 272 బస్సులకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు అందజేశామని చెప్పారు. మిగిలిన 48 బస్సులకు మరమ్మత్తులు చేయించాలని ఈ సందర్భంగా ఎంవీఐ సూచించారు.