చంద్రబాబు పరిపాలన మళ్లీ కావాలని మహిళా లోకం ముక్తకంఠంతో కోరుకుంటోందని తణుకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. టిడిపి- జనసేన- బిజెపి కూటమి తరపున ఆదివారం రాత్రి అత్తిలి మండలం పాలూరు గ్రామంలో ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. ఆమె వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు.