ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలకు తమ వంతు సహకారం అందజేసిన తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణను మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. స్థానిక ఎన్టీఆర్ పార్కు వద్ద ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ సంజయ్, గౌరవ అధ్యక్షులు మల్లిపూడి జగజ్జీవన్, జిల్లా అధ్యక్షులు సిర్రా బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.