రైతును సన్మానించిన బీజేపీ నాయకులు

381చూసినవారు
రైతును సన్మానించిన బీజేపీ నాయకులు
రైతు బిల్లు రైతు సంక్షేమం కోసం రూపొందించబడిన విధాన నిర్ణయమని ఆచంట మండల బీజేపీ అధ్యక్షుడు ముచ్చర్ల నాగ సుబ్బారావు అన్నారు. ఈ చట్టం ద్వారా 70 ఏళ్ల నుంచిరైతులు సరైన మార్కెటింగ్ లేక అయినకాడికి అమ్ముకొనే దుస్థితి నుంచి విముక్తి కలిగిందని అని అన్నారు. కృషి కర్షక్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు పొందడం మొదలుకొని జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన.ప.గో. జిల్లా ఆచంట కు చెందిన రైతు నెక్కంటి సుబ్బారావు ఈ చట్టం గురించి మాట్లాడుతూ..మోదీ రైతుల సంక్షేమం, స్వేచ్ఛా మార్కెటింగ్ కోసం తీసుకు వచ్చిన ఈ బిల్లు రైతుల స్వర్ణముఖివృద్దికి తీసుకు వచ్చిన చట్టంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా మండల పార్టీ కార్యకర్తలు ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మన్నె వీరాస్వామి, దమ్మా రాంబాబు, బందా సతీష్ శర్మ, కొప్పిశెట్టి విజయ్ కుమార్ గుత్తిందీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్