ధనుర్మాసం ప్రారంభం కావడంతో గ్రామాలలో పగటి వేషగాళ్ళ సందడి మొదలయింది. ఈ సందర్భంగా, పెంటపాడు మండలం పెంటపాడు, చిలకంపాడు, బోడపాడు, బైరవపెంటపాడు, అల్లంపురం, పడమటి విప్పర్రు తదితర అన్నిగ్రామాలలో సోమవారం పగటి వేషగాళ్ల సందడితో పండగ వాతావరణం నెలకొంది. స్థానికంగా ఉండే చిన్న పిల్లలు పగటి వేషాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.