భీమవరం కలెక్టరేట్ లోని వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ శుక్రవారం నాగరాణి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను క్రమం తప్పకుండా పూర్తిస్థాయిలో తనిఖీ చేసి కంప్యూటరు డేటా, దస్త్రాల పూర్తి నివేదికలను అందజేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని అటువంటి వారిపై చర్యలు తప్పవన్నారు.