పశ్చిమగోదావరి జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు అన్నిచోట్ల ఏకగ్రీవం అవుతున్నాయని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం భీమవరం నియోజకవర్గంలో 14 నీటి వినియోగదారుల సంఘాల రైతులకు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరిగాయని అన్నారు. అలాగే ప్రతి చోట ఈ ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేస్తామని పేర్కొన్నారు.