పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాస శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో సోమేశ్వర స్వామి వారికి ఆలయ వేద పండితులు వేకువ జామునే ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.