ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్య గణన-2024 జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం భీమవరం కలెక్టరెట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ. ప్రపంచ దేశాల్లోనే యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం అన్నారు. వీరందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందన్నారు.