ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యుత్ చార్జీల పెంపుపై నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు పాల్గొని మాట్లాడారు. మోసపూరిత హామీలను ఇచ్చి కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారాలు వేసిందని మండిపడ్డారు.