జంగారెడ్డిగూడెం: మిగులు భూములను పేద రైతులకు పంచాలి

74చూసినవారు
జంగారెడ్డిగూడెం: మిగులు భూములను పేద రైతులకు పంచాలి
జంగారెడ్డిగూడెం డివిజనల్ ఇరిగేషన్ కార్యాలయం వద్ద మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షులు ఎం. జీవరత్నం మాట్లాడుతూ. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం మిగులు భూములు పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. గత 10ఏళ్ల నుండి పోరాడుతున్న పేదలకు నేటికీ న్యాయం జరగలేదని. ప్రభుత్వం స్పందించి భూములు పంచాలని కోరారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్