జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు మాంసం దుకాణాల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి మటన్ విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిల్వ ఉంచిన చికెన్, మటన్ విక్రయించినా వాటిని హోటళ్లలో వండిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.