ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. కామవరపుకోట మండలం కళ్ళచెరువుకు చెందిన ఏఎంసి మాజీ ఛైర్మన్ మేడవరపు అశోక్ బాబు శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఏలూరు జిల్లాలోని రాజకీయ నాయకులు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన భౌతికదేహానికి పలువురు ఘన నివాళులర్పించారు. వైసీపీ పార్టీలో అశోక్ కీలక నేతగా ఎదిగారు.