ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నక్కా సూర్యచంద్రరావు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ గత వైసిపి దుర్మార్గపు పాలన వలన ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన రాష్ట్ర పోలీసు శాఖను ప్రక్షాళన చేసే దిశగా ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.