వినియోగదారులకు స్థిరమైన ధరలకు నిత్యావసర వస్తువుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సూచనలను జారీ చేసిందని జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆయిల్, పప్పుధాన్యాలు, చక్కెర అసోసియేషన్, ఏలూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సోమవారం సమావేశం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ. ప్రభుత్వ సూచనలను అమలు చేయడానికి, జిల్లాలో 32 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.