అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ప్రభుత్వం తక్షణమే జీవో విడుదల చేయాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద శనివారం అంగన్వాడీ మినీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కే. విజయలక్ష్మి మాట్లాడారు. మినీ వర్కర్ల తోటి మెయిన్ సెంటర్లు మాదిరిగా విధులు చేయిస్తూ కేవలం రూ. 7వేలు జీతం ఇవ్వడం దారుణమన్నారు.