ఏలూరు కలెక్టరేట్లోని వివిధ సెక్షన్లను, ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో కలెక్టరేట్ ఉద్యోగుల విధులకు సంబంధించిన అంశాలను ఆయా సెక్షన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. పక్కాగా రికార్డులను నిర్వహించాలని సూచించారు. ఈ సందర్బంగా ఎస్టాబ్లిస్మెంట్, ల్యాండ్ అండ్ రెవిన్యూ, ప్రోటోకాల్ ఎన్నికలు, కో-ఆర్డినేషన్, తదితర విభాగాలను పరిశీలించారు.