ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో చలో కలెక్టరేట్ మహా ధర్నా విజయవంతం కోరుతూ.. శనివారం సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి, కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. ఈనెల 26న ఏలూరు జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.