మహిళను బెదిరించిన కేసులో ముద్దాయికి 9 నెలలు జైలు శిక్ష, రూ. 1, 000 జరిమానా విధిస్తూ బుధవారం కోర్టు తీర్పును వెలువరించిందని ఏలూరు-1 టౌన్ పోలీసులు తెలిపారు. అజయ్ ఏలూరులోని వరలక్ష్మి అనే మహిళ ఇంటి వద్దకు తాను హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి వస్తున్నానని తమ ఆధార్ కార్డులు ఇవ్వాలంటూ అడిగాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాధితురాల్ని డమ్మీ తుపాకీ లాంటి వస్తువుతో బెదిరించి పర్సు లాక్కొని పారిపోయాడన్నారు.