ఏలూరు నగరంలోని ఆర్ఆర్ పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో త్రీసప్తాహ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వారి ఆధ్వర్యంలో నామ సంకీర్తన గానమృతం, బంగారు బృంద శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రదర్శనలో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.