ఏలూరులో భారీగా వర్షం!

11736చూసినవారు
ఏలూరులో భారీగా వర్షం!
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కుండపోత వర్షం కురిసింది. భారీగా మబ్బులు కమ్ముకొని సుమారుగా గంటసేపు వర్షం కురిసింది. జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. తమ్మిలేరు ఉధృతంగా ప్రవహించడంతో నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ్మిలేరు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలంవెల్లదీస్తున్నారు. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే శనివారంపేట శ్రీపర్రు వద్ద ఉన్న కాజ్ వేలు మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్