ఏలూరులోని బీజేపీ కార్యాలయంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ శాశ్వత ఆహ్వానితులు అంబికా కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సెక్రెటరీ గారపాటి సీతారామ చౌదరి, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.