ఏలూరులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన

53చూసినవారు
ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ 10 వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా పాలస్తీనా ప్రజలకు సంఘీభావ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ దేశం వైమానిక దాడులు మొదలుపెట్టి నేటికీ సంవత్సరం కావస్తున్నదన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వారికి సంఘీభావం తెలిపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్