దీపావళి పండుగలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విధులు చేశారు. అనుమతులు కలిగిన వారు మాత్రమే బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అక్రమ బాణసంచా నిల్వ ఉంచిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.