నేత్రదానంపై అవగాహన

81చూసినవారు
నేత్రదానంపై అవగాహన
అంధత్వ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చాగల్లు వైద్యాధికారి డాక్టర్ తనూజ అన్నారు. గురువారం జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా చాగల్లులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మరణానంతరం నేత్రాలు దానం చేసి, మరోపరికి చూపును ప్రసాదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మనోజ్, పీహెచ్ఎన్ జమీల ఆరోగ్య పర్యవేక్షకులు ఎన్ ఎల్ కే ప్రభావతి, ఎం ఎల్ హెచ్ పీ లు, హెల్త్ అసిస్టెంట్లు,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్