నరసాపురం వశిష్ట గోదావరి తీరాన ఉన్న డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని శుక్రవారం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజినల్ డైరెక్టర్ వరలక్ష్మి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో సేకరించిన చెత్తను గోదావరి తీరాన వేస్తున్నారని హరిత ట్రిబ్యునలకు పట్టణానికి చెందిన సుప్రీం కోర్టు న్యాయవాది దేవేంద్ర ఫణికర్ సీఆర్జెడ్ ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నై నుంచి ఈ బృందం వచ్చింది.