మొగల్తూరు: షష్టివేడుకలు.. భారీ అన్నసంతార్పణ
మొగల్తూరు మండలం కేపీ పాలెం నార్త్ గ్రామం కందుల పాటీ వారి మెరకలోనున్న.. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నందు షష్టివేడుకలు ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయ ఆవరణలో ఆలయ వ్యవస్థాపకులు కందులపాటి ముత్యాలరావు ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. గ్రామం నలుమూలల నుండి సుమారుగా 2 వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదమును స్వీకరించారు.