నిడదవోలు రోటరీ సెంట్రల్ ఆధ్వర్యంలో వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షుడు బొల్లా శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించారు. పాస్ట్ ప్రెసిడెంట్ మాచర్ల మధుసూదన్ రావు ఆర్థిక సహాయంతో కళాశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా అన్ని మతాలు సమానం అని చాటి చెప్పే విధంగా వివిధ మతాలకు సంబంధించిన ఫోటోలను కళాశాలలో ఏర్పాటు చేశారు.