పల్స్ పోలియోకు విరాళం అందించిన విద్యుత్ ఉద్యోగులు

64చూసినవారు
పల్స్ పోలియోకు విరాళం అందించిన విద్యుత్ ఉద్యోగులు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమానికి నిడదవోలు విద్యుత్ శాఖ ఉద్యోగులు రూ. 30వేల విరాళాన్ని ఆదివారం అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు కీర్తి ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ మొత్తాన్ని అందించారు. కార్యక్రమంలో రోటరీ నాయకులు కొత్తపల్లి నాగేశ్వరరావు గొన్నాబత్తుల రామారావు, గుంటుపల్లి శివకుమార్, గోపిరెడ్డి శ్రీనివాస్, కాళ్ళ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్