నిడదవోలుకు చెందిన ఆరవ తరగతి విద్యార్థి కుంచాల తపస్వి రెడ్డి ఇస్రో వారు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో ప్రధమ బహుమతి పొందాడు. అంతరిక్ష వారోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం ఆనం కళాక్షేత్రంలో ఇస్రో శ్రీహరికోట వారు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ పోటీల్లో నారాయణ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న తపస్విరెడ్డి ప్రధమ బహుమతిని కైవసం చేసుకున్నాడు. తపస్వి రెడ్డిని ప్రధానోపాధ్యాయులు గైడ్ టీచర్ రవికుమార్ ఆదివారం అభినందించారు.