నిడదవోలు పట్టణ యాదవుల వీధిలో నిర్వహించిన వినాయక చవితి 9వ వార్షికోత్సవం సందర్భంగా వినాయకుడు ఊరేగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, జిల్లా వైస్సార్సీపీ సెక్రటరీ ఫణీంద్ర, టౌన్ యూత్ వైస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు నాగశ్రి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.