నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయ హుండిని బుధవారం తెరిచి లెక్కించారు. 84 రోజులకు గాను రూ. 22. 54 లక్షల ఆదాయం వచ్చింది. అన్నదాన ట్రస్ట్ కు రూ. 78వేల ఆదాయం వచ్చింది. ఈ లెక్కింపును దేవాదాయ శాఖ తాడేపల్లిగూడెం తనిఖీదారు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి బళ్ల నీలకంఠం, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.