కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిడదవోలు అంబేద్కర్ చౌక్ వద్ద కేవీపీఎస్ పతాకాన్ని పట్టణ నాయకులు డొంకా రమేష్ ఎగుర వేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ కేవీపీఎస్ అంటే కుల సంఘం కాదు కుల నిర్మూలన సంఘమని అన్నారు. ఆత్మ గౌరవం, సమానత్వం, కుల నిర్మూలన ధ్యేయంగా ఏర్పడిన సంఘమని అన్నారు.