గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో నిడదవోలు పట్టణంలో సుమారు రూ. 600 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినట్లు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అన్నారు. నిడదవోలు మునిసిపల్ సాధారణ సమావేశం శనివారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. అజెండాలోని పలు అంశాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో మునిసిపల్ కమిషనర్ పద్మావతి, మున్సిపల్ వైస్ చైర్మన్ లు గంగుల వెంకటలక్ష్మి, బాలరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.