విద్యుత్ ఉద్యోగుల పెన్షనర్ల సంఘకార్యవర్గ సమావేశం అడబాల నరసింహ కొండల రాయుడు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ లందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. గత మూడు సంవత్సరాలుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. గుర్తింపు కార్డులను తక్షణమే అందించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.