నిడదవోలు మండలం సమిశ్రగుడెం గ్రామానికి చెందిన ముప్పిడి కిరణ్ (19) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమిశ్రగూడెం పోలీసులు బుధవారం తెలిపారు. రావిమెట్లకు చెందిన యువతిని కిరణ్ ప్రేమించాడని అయితే అతని తల్లిదండ్రులు ఈపెళ్ళికి నిరాకరించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించినట్లు తెలిపారు. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.