వేడంగిలో గోగులమ్మ అమ్మవారి జాతర

384చూసినవారు
వేడంగిలో గోగులమ్మ అమ్మవారి జాతర
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం వేడంగి గ్రామంలో వేంచేసియున్న గ్రామ దేవత గోగులమ్మ అమ్మవారి జాతరను భారీ ఎత్తున నిర్వహించడానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు మొదలుపెట్టారు. జాతర నిర్వహణలో భాగంగా బుధవారం గోగులమ్మ అమ్మవారి ప్రతిరూపాలైన గరగలను ప్రధాన ఆలయం నుండి గ్రామం మధ్యలో ఏర్పాటు చేసిన పూరి గుడిసె వద్దకు మేళ తాళాలతో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు వెంట ఉండి తీసుకువచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున దారి పొడవునా మంగళ హారతులిస్తూ అమ్మవారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బొలిశెట్టి విశ్వేశ్వరరావు కోట రామారావులు మాట్లాడుతూ.. పూరి గుడి వద్ద అమ్మవారికి 14 రోజుల పాటు నిత్య ధూప దీప నైవేద్యాలు పెట్టి పూజించటం జరుగుతుందన్నారు. ఈనెల 23, 24 తేదీలలో గోగులమ్మ అమ్మవారికి గ్రామ సేవ 25న రాత్రి గ్రామ జాతర జరిపి 26న అమ్మవారిని ప్రధాన ఆలయానికి సాగనంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొలిశెట్టి రాజా, దుప్పన పూడి సత్యనారాయణ, దుప్పనపూడి బుజ్జి, కొట్టి రామం, వలవల బుచ్చియ్య, చెల్లబోయిన వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్